ఒక దర్శకుడు – ఒక ప్రేక్షకుడు : రభస

Featured Article, Movie News Comments Off 14

సినిమా ఆసాంతం నేను ఎంజాయ్ చెయ్యగలిగేలా  సినిమా ఉండాలి – ఒక ప్రేక్షకుడు

నిర్మాత పెట్టిన డబ్బులు తిరిగి వచ్చేలా నేను చేసే చిత్రం ఉండాలి – ఒక దర్శకుడు

ఎవరో దర్శకుడు అన్నట్టు ఏ దర్శకుడు  అనుకొని చెడ్డ చిత్రాలను తియ్యరు , అలానే ఏ ప్రేక్షకుడు ఈ సినిమా బాగోదు అనుకోని థియేటర్ కి వెళ్లరు. కాని థియేటర్ కి వచ్చేలోపు ఒక చిత్రం చెడ్డ చిత్రంగా ఎలా మారింది థియేటర్ నుండి బయటకి వచ్చేలోపు ప్రేక్షకుడికి సినిమా ఎందుకు బాగోలేదు అనిపించింది అన్నదే ఇక్కడ చర్చ ఒక చిత్రం దర్శకుడి ఆలోచన నుండి ఎలా ఉంది అదే చిత్రం ప్రేక్షకుడి ఆలోచనలో ఎలా ఉంది అనేదే ఈ అంశం యొక్క ఉద్దేశం…

రభస చిత్రం గురించి మాట్లాడుకుంటే ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్ లో ఎంతో కీలకమయిన చిత్రం ఇప్పటికి కూడా తన సత్తా కి సరిపడా హిట్ పడని నటుడు ఇతను, అసలు చిత్రం మొదలు పెట్టిన దర్శకుడి ఆలోచన ఏంటో చూద్దాం .. చిత్రాన్ని చూసిన వాళ్ళు మాత్రమే ఈ ఆర్టికల్ చదవాలని మనవి …

ఎన్టీఆర్ సినిమా ఒకే అయ్యింది గట్టిగా హిట్ ఇచ్చాం అంటే పెద్ద డైరెక్టర్ అయిపోవచ్చు , ఒక విభిన్నమయిన చిత్రాన్ని తెరకెక్కించి ప్రేక్షకుడిని అవాక్కయ్యేలా చెయ్యాలి అంతే కాకుండా ఎన్టీఆర్ కెరీర్ లోనే మంచి సినిమా ఇవ్వాలి.. ఇది దర్శకుడి ఆలోచన, ఇదే సమయంలో ప్రేక్షకుడు ఆలోచన ఎలా ఉంటుంది అంటే ..

ఎన్టీఆర్ తో సంతోష్ శ్రీనివాస్ సినిమా ఒకే అయ్యింది , కందిరీగ తో రామ్ కి హిట్ ఇచ్చాడు ఈ సినిమాతో ఎన్టీఆర్ కి కూడా గట్టి హిట్ ఇస్తే బాగుంటుంది .. బుడ్డోడు హిట్ కొట్టి చాలా రోజులు అయ్యింది సరయిన సినిమా పడట్లేదు బుడ్డోడికి .. మరి సంతోష్  శ్రీనివాస్ కి ఇది రెండవ సినిమా ద్వితీయ విఘ్నాన్ని చేధించగలడా? …

ద్వితీయ విఘ్నం , అవును ఇది మన రెండవ సినిమా తెలుగు పరిశ్రమ సెంటిమెంట్  ప్రకారం హిట్ కొట్టడం కష్టం ఇక్కడ ప్రయోగాలు చెయ్యడం వద్దు ఎలాగు రాసుకున్న కందిరీగ -2 ఉందిగా దాన్నే ఎన్టీఆర్ కి తగ్గట్టుగా రాసేద్దాం ఎంత కాదన్నా సేఫ్ ప్రాజెక్ట్ అవుతుంది . కాని ఇలా వేరొక హీరో కి రాసుకున్న కథని ఎన్టీఆర్ లాంటి మాస్ ఇమేజ్ ఉన్న హీరో కి అన్వయించడం ఎలా ఎలా …

(థియేటర్లో ప్రేక్షకుడు అంచనా)

ముందుగా  హీరో కి మంచి ఇంట్రడక్షన్ ఉండాలి .. సుమోలు గాల్లోకి ఎగరకపోయినా పరవాలేదు, పెద్ద పెద్ద డైలాగ్ లు లేకపోయినా పర్లేదు హీరో ఆటిట్యూడ్ కనపడేలా ఉండాలి ఒక మంచి ఫైట్ ఉంటె బాగుంటుంది … – ప్రేక్షకుడు

కందిరీగ 2 లో అసలు ఇంట్రడక్షన్  ఫైట్ లేదు.. ఇప్పుడెం చేద్దాం  ?? ఎలాగు ఫస్ట్ ఫైట్ ఉందిగా దాన్ని కాస్త ముందుకు తెచ్చేసి తరువాత ఫ్లాష్ బ్యాక్ ఎసుకుంటే సరిపోద్ది అంతేగా.. ఫైట్ అంటే అలా ఇలా కాదు గాల్లోకి బైక్ ఎగరాలి, హీరో చెప్పే పెద్ద పెద్ద డైలాగ్స్ అయ్యే వరకు విలన్స్ వెయిట్ చెయ్యాలి ఆ తరువాత అందరిని హీరో గాల్లోకి కొట్టాలి …ఇది ఒక ప్రేక్షకుడు మాస్ హీరో నుండి ఆశించేది … డైలాగ్ లో టైగర్ ఉండాలి మరిచిపోకూడదు ఇది.. దర్శకుడు

ఈ ఫైట్ చూసాక ప్రేక్షకుడి పరిస్థితి … బులెట్ ఏసుకొని గాల్లో ఎగురుకుంటూ వచ్చాడు అందరిని గాల్లోకి కొట్టేసి పోయాడు. పోతూ పోతూ సందర్భంతో సంభంధం లేని పది డైలాగ్ లు చెప్పాడు కాని ఫైట్ కి మాత్రం సరయిన కారణం చెప్పలేదు ఏంటో …

ఫైట్ ఎలాగు బాగోలేదు, హీరో బాగా డాన్స్ చేస్తాడు కాబట్టి మంచి బీట్స్ ఉన్న పాట పడాలి థియేటర్ అద్దిరిపోద్ది అసలే ఎన్టీఆర్ డాన్స్ అంటే అరాచకం చేస్తాడు మంచి ఊపున్న సాంగ్ కి మంచి స్టెప్స్ పడితే థియేటర్ లో పూనకమే – ఒక ప్రేక్షకుడు

దర్శకుడు – ఫైట్ అయిపోయింది, డైలాగ్స్ చెప్పేసారు ఇక్కడ ఒక పాట పడాలి ప్రేక్షకుడు ఇదే కోరుకుంటాడు కాని రొటీన్ కి బిన్నంగా ఉండాలి హీరో ని అమెరికా నుండి వచ్చినట్టు చూపిద్దాం (కథతో దీనికి ఎటువంటి సంభంధం లేదు) అయినా చూపిద్దాం ఇండియా కి రాగానే అతనిలో దేశభక్తి పరవళ్ళు తొక్కి ఈ దేశానికి “మార్ సలాం” అంటూ డాన్స్ చేయిద్దాం అరెరే పాటలో లిరిక్ కూడా వచ్చేసింది..

ప్రేక్షకుడు – ఈ పాటలో ఎన్టీఅర్ స్టెప్ లు వెయ్యలేదు అని పాటకు ముందు మరియు పాట నడుస్తున్న సమయం మొత్తం ఈ పాటకి ఈ చిత్రానికి సంభంధం లేదు అని వేసి ఉంటె సరిగ్గా సరిపోయేది (మిగిలిన సినిమాలలో ఇటువంటి పాటలు హీరో వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయి ఇందులో అది కూడా చెయ్యలేదు)…

పాట అయిపోయింది ఇక్కడ హీరో కి ఒక లక్ష్యం ఉందని చెప్పాలి హీరో తల్లిదండ్రులకి ఒక ఫ్లాష్ బ్యాక్ పెడదాం అక్కడ నుండి అమ్మ కోరికకి షిఫ్ట్ అవుదం .. అమ్మ, అమ్మకి అన్నయ్య, ఆయనకి కూతురు.. కుటుంబ కథా చిత్రం అయిపోయింది గా సూపర్, మామయ్య కూతురి పేరు చిట్టి  అని చెబుదాం కాసేపు ఎవరు ఆ చిట్టి అని ప్రేక్షకుడు అనుకుంటాడు సస్పెన్స్ బాగుంటుంది.. – దర్శకుడు

ప్రేక్షకుడు – రెండు కుటుంబాలను చూపెట్టి కుటుంబ కథా చిత్రం అనిపించేసారు, ఇప్పుడేంటి చిట్టి ని హీరో పెళ్లి చేసుకోవాలి ఇంకెందుకు లేట్ సమంత ని తీసుకోచ్చేయండి…

సమంత ని వేరే పేరుతో ఇంట్రడ్యూస్ చేద్దాం అలానే షాయాజీ షిండే కూతురుగా కూడా చూపిద్దాం కాని హీరో కి మాత్రం ప్రణీత ను చిట్టి లాగా పరిచయం చేద్దాం … – దర్శకుడు

ప్రేక్షకుడు – ముక్కు ఎక్కడుంది అంటే మూడు ఊర్లు చుట్టూ తిప్పాడంట వెనకటకి ఎవరో .. బహుశా ఈ దర్శకుడే అనుకుంటా ..

హమ్మయ్య ఇంకా ప్రేక్షకుడు ఎన్టీఆర్, సమంత నే  చిట్టి అని ఎలా తెలుసుకుంటాడు అని ఉత్కంట గా వెయిట్ చేస్తూ కూర్చుంటాడు – దర్శకుడు

ప్రేక్షకుడు – ఎలాగు తెలుసుకుంటాడు అని తెలుసు ఇంటర్వెల్ దగ్గరే తెలుసుకుంటాడని  తెలుసు … మిగిలినదంతా ఫార్మాలిటీ నే కదా…

దర్శకుడు – ఇక్కడ పాట రావాలి అది ఎన్టీఆర్ దగ్గర పాడించాలి ప్రనీతకి ఎన్టీఆర్ మధ్య ఉండాలి …ఎన్టీఆర్ అమ్మాయి వెంటపడుతూ పాడే పాట డాన్స్ లు అద్దిరిపోవాలి  …

ప్రణీత పాత్ర ప్రేమిస్తుంది అని తెలిసాక “రాకాసి రాకాసి , నువ్వు లేని జీవితం రంగు లేని నాటకం” అని పాడటం ఎందుకు .. వాళ్ళు ఇద్దరు కలవరు అని తెలిసినా కూడా ప్రేక్షకుడు ఎలా ఎంజాయ్ చెయ్యగలడు ఈ పాటని … అసలు ప్రేమంటే పడదు అనే అమ్మాయిని ప్రేమంటే పడదు కాని నిన్ను ప్రేమిస్తున్న అని పడేయటం.. దర్శకుడు గారు ఏంటిది.. ఒక మంచి పాట వ్యర్థం అయిపోయింది అంతే ఆకుండ ఎన్టీఆర్ డాన్స్ లు వెయ్యలేదు అన్న హెచ్చరికను మరిచిపోయారు ఈ పాటలో కూడా  – ప్రేక్షకుడు ..

ఎక్కడో ఏదో తేడా కొడుతుంది… కరెక్ట్ ఇక్కడ అజయ్ ని హాస్పిటల్ లో చూపించాలి , తమ్ముడిని కోమాలో కొట్టిన వాడిని ఎలాగయినా పట్టుకోవాలి అని గట్టిగా అరిపించాలి .. ఎందుకు వెతుకుతున్నాడు ఎప్పుడు దొరుకుతాడు అని ప్రేక్షకుడికి ఇంకొక సస్పెన్స్ ఉంటుంది… – దర్శకుడు

ప్రేక్షకుడు – ఇంతసేపటికి ఏదో ఒకటి సస్పెన్స్ లా ఉంది ఇంటర్వెల్ కి ఇంకొక ట్విస్ట్ దొరికింది అన్నమాట…

దర్శకుడు – ఇక్కడ నిజం బయట పెట్టించాలి , సమంత నే చిట్టి అని ఎన్టీఆర్ కి తెలిసిపోవాలి … కాని సమంత పాత్ర కి సరయిన పునాది లేదు … సరే సమంత ఒక వ్యక్తి ని ప్రేమిస్తుంటుంది అతనిని ఒక్కసారి కూడా చూసి ఉండదు ఒక్కసారే మాట్లాడి ఉంటుంది .. అతను ఎవరో అని ప్రేక్షకులకి సస్పెన్స్ ఉంటుంది …

ప్రేక్షకుడు – ఎన్టీఆర్ , మన సినిమాల్లో హీరోయిన్ లు హీరో లని కాకుండా ఇంకొకరిని ఎందుకు ప్రేమిస్తారు డైరెక్టర్ గారు ఆ లాంచనం కూడా కానివ్వండి… సమంతనే చిట్టి అని చెప్పేశారు హమ్మయ్య ఒక లాంచనం పూర్తి అయ్యింది..

దర్శకుడు – ఇక్కడ ఒక ఫైట్ పడాలి … హీరోఇజం అద్దిరిపోద్ది…

ప్రేక్షకుడు – వాట్?? హీరో కొడితే స్కార్పియో ముందు టైర్ లు ఊడిపోయి ఇటు వైపుది అటు వైపుకి అటు వైపుది ఇటు వైపుకి పడిపోయాయా ఇది చాలదని వెనక టైర్ లు కూడా ఊడిపోయాయా.. స్కార్పియో కి ఇంత డామేజ్ చేసరెంటి? (సినిమాలో స్కార్పియో కి కాదు బ్రాండ్ కి).. అసలు  ఈ గ్రాఫిక్స్ ఏంటి ఇలా ఉన్నాయి .. ఇంగ్లీష్  హల్క్ సినిమా డబ్బింగ్ చూస్తున్నట్టు ఉంది హీరో దేన్ని కొట్టినా ఎగిరి కిలోమీటర్ అవతల పడుతుంది ….

దర్శకుడు – హమ్మయ్య ఫైట్ అయిపోయింది ఇక్కడ మంచి మాస్ పాట పడాలి … ఎన్టీఆర్ డాన్స్ లు ఇరగదీయాలి ..

ప్రేక్షకుడు – ఈ సందర్భం కాకరకాయ అంటూ ఏదీ లేని ఈ పాట ఎందుకొచ్చింది ఇక్కడ … పాటకి సందర్భం అంటూ లేదు ఎన్టీఅర్  డాన్స్ లో కిక్ లేదు .. అసలు స్టొరీ కి సీన్స్ కి , సీన్స్ కి సాంగ్స్ కి, సాంగ్స్ కి లిరిక్స్ కి అసలు లింక్ కుదరకుండా ఎలా రాసుకున్నావయ్య రచయిత … ఎన్టీఆర్ … డాన్స్ లు.. హెచ్చరిక… మరిచిపోయారు …

ఇక్కడ ఒక ట్విస్ట్ తో ఇంటర్వెల్ ఇచ్చేయచ్చు – దర్శకుడు

ప్రేక్షకుడు – ఫస్ట్ సీన్ అయిపోగానే ఈ సీన్ ఎసేసి ఇంటర్వెల్ అనేసి ఉన్నా కూడా తేడా ఉండదు దీని కోసం ఇంతసేపు వెయిట్ చేయించావా… ఆ ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండ్ సీన్ దగ్గరే తెలిసిపోద్దిగా ఎందుకు అంత బిల్డ్ అప్ … ఉన్న ఐదు పాటల్లో మూడు పాటలు ఫస్ట్ హాఫ్ లోనే వచ్చేసాయి .. అసలా సెకండ్ హాఫ్ లో ఎం చెయ్యాలి అనుకున్నాడో దర్శకుడు .. ఇక్కడ నుండి డైరెక్ట్ గా క్లైమాక్స్ కి పోయే అవకాశం కూడా ఉందంటే కథనం ఎంత బలంగా ఉందో అర్ధం అయిపోద్ది..

దర్శకుడు – ఇక్కడ చిన్న ఫ్లాష్ బ్యాక్ పెట్టాలి సమంత వెయిట్ చేస్తుంది ఎన్టీఆర్ కోసమే అని ప్రేక్షకులకి తెలియాలి …

ప్రేక్షకుడు – మాకు తెలుసు ఇంకేదయినా ఉంటె చెప్పండి…

అంతే కాకుండా అజయ్ ఎందుకు వెతుకుతున్నాడో కూడా క్లారిటీ ఇవ్వాలి.. అలానే జయప్రకాశ్ రెడ్డి ని ఇక్కడ తీసుకొస్తే ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అవుతారు … – దర్శకుడు

ప్రేక్షకుడు – ఇక్కడ  జయప్రకాశ్ రెడ్డి ఎందుకు వచ్చాడు? ఫస్ట్ హాఫ్ లో ఒక్కసారి పేరుగా వినపడిన జయప్రకాశ్ రెడ్డి ని నెల్లూరు లో పెద్ద తోపు అంటే నేను ఎందుకు నమ్మాలి .. ఓహో కందిరీగ లో సెకండ్ హాఫ్ లో జయప్రకాశ్ రెడ్డి వచ్చాడు కాబట్టి ఇక్కడ కూడా అలానే వచ్చాడా.. అసలు ఇది కుటుంబ కథా చిత్రం అని మొదటి సన్నివేశం లోనే ఒప్పెసుకున్నాం కదా మళ్ళీ  ఈ అదనపు రెండు కుటుంబాలను ఎందుకు తీసుకొచ్చారు కథలోకి ….

దర్శకుడు – ఇప్పడు హీరో ని హీరోయిన్ ని జయప్రకాశ్ రెడ్డి ఇంట్లో పెట్టెయ్యాలి …

ప్రేక్షకుడు – కందిరీగ ..

దర్శకుడు – అలానే అజయ్ మరియు మిగిలిన బ్యాచ్ ని హీరో ఆడుకోవాలి …

ప్రేక్షకుడు – కందిరీగ

దర్శకుడు – హీరో జయప్రకాశ్ రెడ్డి కూతురు పెళ్లి చెయ్యాలి అనుకుంటాడు ..

ప్రేక్షకుడు – అయినా సరే కందిరీగ నే …

దర్శకుడు –  క్లైమాక్స్ కి ఇంకా చాలా టైం ఉంది మన దగ్గర అన్ని సీన్స్ లేవు …

గత పదిహేను నిమిషాలుగా చెప్పిందే చెప్తున్నారు  కొత్తగా ఏదయినా చెప్పవచ్చు గా .. పోనీ క్లైమాక్స్ అయిన వేసేయ్యచ్చు గా – ప్రేక్షకుడు

దర్శకుడు – ఇక్కడ బ్రహ్మానందం ని పెడితే థియేటర్ దద్దరిల్లిపోతుంది …

ప్రేక్షకుడు – మళ్ళీ ముక్కు ఎక్కడ ఉంది అంటే మూడు ఊర్ల అవతల ఉంది వెళ్దాం పద అంటన్నారు  … పదండి  వస్తా.. టిక్కెట్ కొన్నాక తప్పుద్దా..

దర్శకుడు – ఇక్కడ బ్రహ్మానందంతో కోమా కామెడీ చేయిద్దాం ఇది సినిమాకి హైలెట్ అవ్వుద్ది ..

ప్రేక్షకుడు – కోమా కామెడీ? ఇది ఎక్కడో చూసినట్టు ఉందే .. వెయిట్ ఇది “అల్లుడు శీను” లో సీన్ లా ఉందే .. బెల్లంకొండ గారు వాట్ ఇస్ దిస్?

దర్శకుడు – బ్రహ్మానందం తో ఇంకొక కామెడీ సీన్ ..

ప్రేక్షకుడు – సినిమాకి సంభంధం లేదు ..

దర్శకుడు – బ్రహ్మానందం తో ఇంకొక సీన్ ..

ప్రేక్షకుడు – దీనికి కూడా సినిమాతో సంభంధం లేదు ….

దర్శకుడు – ఎన్టీఆర్ సీక్రెట్ సీతగారికి తెలిసి పోవాలి మంచి ట్విస్ట్ అవుతుంది…

ప్రేక్షకుడు : ఇక్కడ ట్విస్ట్ ఇది కాదు షియాజీ షిండే తీసిన వీడియో లో ఒక ఫ్రేమ్ ఎన్టీఆర్ వెనుక నుండి చూపిస్తే ఇంకొక ఫ్రేమ్ సీత గారి వెనుక నుండి ఉంటుంది.. కాని ఇదంతా షియాజీ షిండే గారు కిటికీ లో నుండి మొబైల్ లో తీస్తారు .. మంచి టెక్నిక్ ఉన్న కెమెరా మాన్ లా ఉన్నాడు… ఎవరు వాడుకోవట్లేదు మరి …

దర్శకుడు : ఏదో మరిచిపోయాను అనిపిస్తుంది ఏంటది ….

ప్రేక్షకుడు : సినిమా మొదలుపెట్టినప్పుడు హీరో కి తల్లి జయసుధ తండ్రి నాజర్ ఉండాలి డైరెక్టర్ గారు వాళ్ళు ఏమయిపోయారు .. హీరో అమ్మ జయసుధ ఆశయం మరిచిపోయి పశ్చాతాపం లో సీత గారి ఆశయం తీర్చేస్తున్నాడు … హీరోయిన్ ని కూడా మర్చిపోయారు పాపం ఫోన్ లో వ్యక్తి కోసం ఫోన్ బుక్ మొత్తం మూడు సార్లు చదివేసింది ఇప్పటికే ….ఇందాక పాటలో కనిపించిందే, అసలు సినిమాతో సంభంధం లేనట్టు అప్పుడప్పుడు కనిపించి వెళ్ళిపోతుంది. ఆమె పాత్రకి ఏదో ఒక సమాధానం ఇవ్వండి కనీసం ఆ పాత్ర కథానాయిక పాత్ర అని అయినా గుర్తించండి…

దర్శకుడు : హా గుర్తొచ్చింది బ్రహ్మానందం తో కామెడీ సీన్ వెయ్యాలి ఇక్కడ …

ప్రేక్షకుడు : దా…వుడా !

దర్శకుడు : ఇంకా సినిమాని సెంటిమెంట్ మోడ్లో కి తీసుకెళ్ళి క్లైమాక్స్ కి మెట్లు వేసేయ్యచ్చు ….

ఒక్కసారిగా హీరో కి ఇన్ని కష్టాలు వచ్చేసాయి ఏంటి… హీరోయిన్ ని వదిలేయాలి .. చెల్లెల్ని పెళ్లి చేసుకోబోయే వాడిని సొంత అన్నయ్య కిడ్నాప్ చేసి ఏ సంభంధం లేని ఎన్టీఆర్ ని బ్లాకు మెయిల్ చేస్తన్నారు .. వెయిట్ జయప్రకాశ్ రెడ్డి కి ఎన్టీఆర్ గురించి ఇప్పటి వరకు తెలియదా? .. హీరో అమెరికా నుండి వచ్చి “మార్ సలాం” పాట పాడాడు అదొక్కటే క్లారిటీ ఉంది నాకు …. మిగిలింది అంతా గందరగోళం చిందరవందర … – ప్రేక్షకుడు

దర్శకుడు – ఇక్కడ క్లైమాక్స్ ఎసేసుకోవచ్చు భారీ ఫైట్ సెంటిమెంట్ డైలాగ్స్ తో సినిమా ముగించేయ్యచ్చు …

ప్రేక్షకుడు – ఎక్కడ మొదలు పెట్టి ఎక్కడికి  తీసుకెళ్ళి ఎలా ముగించారు అసలా.. హీరో కి ఒక లక్ష్యం ఉండి దాన్ని చేరుకోగానే చిత్రం ముగుస్తుంది ఇది మాములు చిత్రం కాని ఇక్కడ హీరో కి మొదటి అర్ధ భాగంలో ఒక లక్ష్యం ఉంది దానికి ఎటువంటి సంభంధం లేని రెండవ అర్ధ భాగంలో ఇంకొక లక్ష్యం ఉంది … ఈ చిత్రం ఒక్క టిక్కెట్ మీద రెండు చిత్రాలను  చిత్రాలను చూసిన ఫీలింగ్ ఇచ్చింది కాని  ఒక్కటి కూడా పూర్తిగా చూసిన ఫీలింగ్ అయితే ఇవ్వలేదు .. గందరగోళ కథనానికి హడావిడి క్లైమాక్స్ ఒకటి తోడయ్యింది .. ఇక క్లైమాక్స్ లో జయప్రకాశ్ రెడ్డి చెప్పిన డైలాగ్స్ కి విలన్స్ మారిపోయారు అంటే .. ఈ రచయితలను భారత్  – పాక్ సంధి సమావేశాలకి పంపాల్సిందే …. మొత్తానికి దర్శకుడి దయ వలన హీరో అమ్మ మరియు మిగిలిన అ అమ్మ పాత్రలను ఆశయాలను తీర్చేసాడు … ఈ చిత్రంలో హీరో ఒక మేయర్ స్థాయి వ్యక్తి  ఇంటికి వెళ్లి “రభస” చేసినా, విలన్స్ పబ్లిక్ గా  హీరో ఫ్రెండ్స్  ని కొట్టేస్తున్నా , ఒక కాల్గే ప్రిన్సిపాల్ ని హీరో బెదిరించినా, హీరో హీరోయిన్ ని కిడ్నాప్ చేసినా కూడా  పోలీస్ లు పట్టించుకోరు.. న్యాయ వ్యవస్థ, చట్ట వ్యవస్థ అనేది లేని ప్రపంచంలో ఈ చిత్రం నడుస్తుంది… ఏదయితేనేం ఎలాగోలా చిత్రాన్ని అయిపోనిచ్చారు దర్శకుడు గారు …

దర్శకుడు – హమ్మయ్య సినిమా అయిపోయింది ..

ప్రేక్షకుడు – హమ్మయ్య!! సినిమా అయిపోయింది ….

అలా అని ఈ చిత్రంలో అసలు మంచి అంశాలు లేవని కావు , చిత్రంలో కొన్ని కామెడీ సన్నివేశాలు కొన్ని స్క్రీన్ప్లే లాక్ లు చాలా బాగా వేసుకున్నారు కాని కథ తో సంభంధం లేని కామెడీ మరియు వేసిన లాక్ ని సరిగ్గా హేండిల్ చెయ్యలేకపోవడంతో ఇవి హైలెట్ అవ్వలేదు..

(చిత్రం విడుదలకి తరువాత ) …

దర్శకుడు : అంత కష్టపడి చిత్రాన్ని తీసినా చూడట్లేదు తెలుగు ప్రేక్షకులకు సినిమాలు చూడటం  రాదు…

ప్రేక్షకుడు – ఇంత కష్టపడి సినిమా చూడాల్సి వచ్చింది తెలుగు దర్శకులకి సినిమాలు తీయడం రాదు…

 

ఇలా అనుకుంటూనే ఆ దర్శకుడు మరొక చిత్రం చేస్తాడు … ఈ ప్రేక్షకుడు ఆ చిత్రాన్ని కూడా చూస్తాడు .. ఇదేగా రొటీన్ తతంగం ..

గమనిక : ఏదో నాకున్న పరిజ్ఞానానికి  నేను థియేటర్ లో పొందిన అనుభవాన్ని కలిపి రాసిన ఆర్టికల్ ఇది, ఎవరిని నొప్పించాలనే ఉద్దేశంతో రాసింది కాదు ఎవరయినా నొచ్చుకొని ఉంటె పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నా ..

Search

Back to Top